మహేష్‌తో సినిమా కథ వెనక అసలు `నిజం`.. రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్ పై లీకులిచ్చిన స్టార్‌ రైటర్‌....!

murali krishna
రాజమౌళి నుంచి రాబోతున్న సినిమాపైనే అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఆయన మహేష్‌తో చేయబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే దీనిపై రోజుకో కొత్త వార్త బయటకు వస్తుంది.బాహుబలి`తో సంచలనాలు సృష్టించిన రాజమౌళి ఆ తర్వాత ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`తో అదరగొట్టాడు. ఇది ఆ స్థాయి హిట్‌ కాలేకపోయినప్పటికీ దాన్ని మించిన ప్రశంసలందుకుంది. ఏకంగా ఆస్కార్‌ బరిలోనూ నిలిచింది. ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు, సినీ వర్గాలు స్పందించి ప్రశంసలు కురిపించాయి. ఇప్పుడీ చిత్రం జపాన్‌లోనూ విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే జక్కన్న నెక్ట్స్ సూపర్‌ స్టార్‌ మహేష్‌ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌ రేంజ్‌లో అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు దర్శకధీరుడు. ప్రపంచ సాహసికుడి నేపథ్యంలో కథ సాగుతుందని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. ఆఫ్రీకా అడవుల బ్యాక్‌ డ్రాప్‌లో కథ ఉంటుందని రైటర్‌ విజయేంద్రప్రసాద్‌ కూడా చెప్పారు.అయితే తాజాగా మరో లీక్‌ ఇచ్చారు రైటర్‌ విజయేంద్రప్రసాద్  ఈ కథ గురించి మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ కథ నిజ జీవితం ఆధారంగా రాసుకున్నదని తెలిపారు. రిలీజ్‌ లైఫ్‌ ఇన్స్ డెంట్స్ ఆధారంగా సాగే కథ అని చెప్పారు. ప్రస్తుతం తాను రాజమౌళి కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నామని, అది పూర్తవడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుందన్నారు.
ఇంకా ఆయన చెబుతూ, ఇది మహేష్‌ బాబు కెరీర్‌లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుందని, బడ్జెట్‌ వైజ్‌గానూ భారీగా ఉండబోతుందని చెప్పారు. సినిమాని వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. మొత్తానికి ఇది మహేష్‌ బాబుని హీరోగా, స్టార్‌ డమ్‌ విషయంలో, ఇమేజ్‌ విషయంలో మరో మెట్టు ఎక్కించే చిత్రమవుతుందని, ఆయన్ని గ్లోబల్‌ స్టార్‌ని చేసే చిత్రమవుతుందని అంటున్నారు నెటిజన్లు.ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో `` చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. అనంతరం రాజమౌళి సినిమా స్టార్‌ కానుంది. ఇదిలా ఉంటే ఇందులో విలన్‌ పాత్రల కోసం ఇద్దరు స్టార్‌ హీరోలను తీసుకోబోతున్నారట జక్కన్న. తమిళ హీరో కార్తి, బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌లను తీసుకునే ఆలోచన ఉన్నట్టు టాక్. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: