కోలీవుడ్
ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న
హీరో లలో ఒకరు అయిన
శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
శివ కార్తికేయన్ ఇప్పటికే తాను నటించిన అనేక
మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే
శివ కార్తికేయన్ ఆఖరుగా డాన్ అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ కి శిబి
చక్రవర్తి దర్శకత్వం వహించగా , ప్రియాంక అరుల్
మోహన్ ఈ
మూవీ లో
శివ కార్తికేయన్ సరసన
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ ని తెలుగు లో కాలేజ్ డాన్ పేరుతో విడుదల చేశారు. ఈ
మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా
శివ కార్తికేయన్ "ప్రిన్స్" అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ కి జాతి రత్నాలు
మూవీ తో దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న
అనుదీప్ కేవి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని
అక్టోబర్ 21 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ
మూవీ కి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. అలాగే ఈ
మూవీ రన్ టైమ్ ను కూడా
మూవీ యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ
మూవీ ని 2 గంటల 23 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు
మూవీ యూనిట్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా మామూలు నిడివి తో
ప్రిన్స్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.