టైటిల్ వివాదంలో సుధీర్ బాబు సినిమా..!!

Divya
హీరో సుధీర్ బాబు నటించిన హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం హంట్. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఒక టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ చుట్టూ పలు వివాదాలు తలెత్తుతూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. హంట్ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్ పతాకం పై ఈ చిత్రాన్ని వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా టైటిల్ తనది అంటూ తాజాగా ఇవ్వనటుడు నిక్షిత్ ఆరోపిస్తూ ఉన్నారు.


M.S. ఆర్ట్స్ శ్రీ క్రియేషన్ బ్యానర్ పై మూడు నెలల క్రితమే తను ఆ పేరును ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించారని తెలియజేయడం జరిగింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ హంట్ టైటిల్ పై హక్కులు తమకే ఇచ్చిందని నిక్షిత్ తెలియజేయడం జరిగింది. అయితే సుధీర్ బాబు , భవ్య క్రియేషన్ సంస్థ పై హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కూడా ఇదే టైటిల్ పెట్టి టీజర్ సాంగ్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ విషయంపై ఇప్పటికి ఫిలిం చాంబర్ వరకు ఫిర్యాదు వెళ్లినట్లుగా సమాచారం.


గతంలో హంట్ రిజిస్టర్ అయినందున టైటిల్ మార్పును పరిశీలించాలని ఫిలిం ఛాంబర్ సూచన కూడా భవ్య క్రియేషన్ పట్టించుకోవడంలేదని నిక్షిత్ తెలియజేశారు. ఇది తనకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా తన టైటిల్ మార్చుకునేలా ఫిలిం ఛాంబర్ పెద్దలు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇక గతంలో కూడా టైటిల్ వివాదాలు చాలానే వినిపించాయి. రామ్ నటించిన ది వారియర్ సినిమాలో కూడా ఇదే జరిగింది. ఇక చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా టైటిల్ పైన కూడా అభ్యంతరాలు వచ్చాయి.. దీంతో హిందీలో మెగా స్టార్ గాడ్ ఫాదర్ అని ఇంగ్లీషులో మెగాస్టార్ 153# గాడ్ ఫాదర్ అని పెట్టడం జరిగింది. మరి హంట్ సినిమా టైటిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చిత్ర బృందం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: