రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ సక్సెస్ అవుతుందా..!!

murali krishna
ఎప్పుడు ఐతే ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం మన అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను `అఖండ` సినిమా ఎంతటి భారీ విజయం అందుకున్న తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా రామ్ కి కూడా చాలా కీలకం అని మనం చెప్పాలి మరి, ఎందుకంటే గత చిత్రం 'ది వారియర్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో రామ్ కు బాక్సాఫీస్ వద్ద నిరాసే ఎదురైనా  విషయం మనకు తెలిసిందే.

 కానీ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మరో `అఖండ` సినిమా అన్నట్లుగా ఉంటుందని రామ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టిని ఈ సినిమాలో ప్రముఖ పాత్రకు గాను ఎంపిక చేశారని మనకి సమాచారం. సునీల్ శెట్టి రామ్ కు తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై రామ్ అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

వారి అసహనానికి కారణం.. సునీల్ శెట్టి తెలుగులో మోసగాళ్లు మరియు గని సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. ఆ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాన్ని ఎదుర్కొన్నాయి. కాబట్టి బోయపాటి శ్రీను, రామ్ సినిమాలో సునీల్ శెట్టి ని నటింప చేయడం కచ్చితంగా మంచి విషయం కాదని.. బ్యాట్ సెంటిమెంట్ అవసరమా? నీకు రిస్క్ ఎందుకు రామ్? అని కొందరు రామ్ అభిమానులు  అతని ప్రశ్నిస్తున్నారు. అయితే డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కథకు రామ్ తండ్రి పాత్రలో సునీల్ శెట్టి అయితే బాగుంటుం డని అభిప్రాయంతో ఉన్నాడని అందుకే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారని ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే అంచనాలకు తగ్గట్టు బోయపాటి శ్రీను ఈ సినిమాను తీసుకొస్తాడా? టాలీవుడ్లో సునీల్ శెట్టి ఈ సినిమాతో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ను దక్కించుకుంటాడా, అనేది చిత్రం విడుదల అయ్యే దాక మనం వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: