మరో సినిమా కథకు సీక్వెల్ సెట్ చేస్తున్న సుకుమార్.. మెగా హీరోతో చర్చలు!
తప్పకుండా పుష్ప సెకండ్ పార్ట్ తో కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకుంటాడు అని ఒక నమ్మకం అయితే ఏర్పడింది. పుష్ప సెకండ్ పార్ట్ దాదాపు 1000 కోట్ల వరకు బిజినెస్ చేయవచ్చు అని కూడా మార్కెట్లో టాక్ అయితే వినిపిస్తోంది. అయితే సుకుమార్ కు పుష్ప 2 తర్వాత రెండు కమిట్మెంట్స్ అయితే ఉన్నాయి. ముందుగా అయితే విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గత ఏడాదిలోనే వీరిద్దరూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.ఇక రాంచరణ్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇద్దరికీ అగ్రిమెంట్ కూడా కుదిరింది. సుకుమార్ ఎలాంటి సినిమా చేస్తాడు అనే విషయంలో కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తోంది. చరణ్ తో చేయాలనుకుంటున్న కథ గురించి మెగాస్టార్ చిరంజీవితో కూడా సుకుమార్ మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న టాక్ ప్రకారం అయితే రంగస్థలం సినిమాకు సీక్వెల్ చేయాలి అని సుకుమార్ ఒక స్టోరీ లైన్ అనుకున్నట్లుగా తెలుస్తోంది.కేవలం మెగాస్టార్ తో మాత్రమే ఆ కథ గురించి కొంత చర్చలు జరుపుకున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఈ విషయంలో ఇంతవరకు ఎవరు కూడా క్లారిటీ అయితే ఇచ్చింది లేదు. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చే సినిమా దాదాపు రంగస్థలం తరహా లోనే ఉంటుందట. ఇక ఆ స్టోరీ లైన్ తోనే సుక్కు మరొక కథ సెట్ చేసుకున్నాడని కూడా టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇది ఇంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక పుష్ప సెకండ్ పార్ట్ ను వచ్చే ఏడాది చివరలో లేదా 2024లో మొదట్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని సమాచారం.