మెగాస్టార్
చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్
మూవీ లలో
హీరో గా నటించి ప్రస్తుతం కూడా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే
చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం లో రెండు
మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం లో
చిరంజీవి మొదట గా ఆచార్య
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా
చిరంజీవి "గాడ్ ఫాదర్" అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ కి
మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ
మూవీ లో
సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన
తార ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , ఎస్ ఎస్
తమన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించాడు.
భారీ అంచనాల నడమ విడుదల అయిన
గాడ్ ఫాదర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని అద్భుతమైన కలెక్షన్ లను
బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ
మూవీ తెలుగు తో పాటు
హిందీ లో కూడా భారీ ఎత్తున విడుదల అయింది. ప్రస్తుతం ఈ
మూవీ కి తెలుగు తో పాటు
హిందీ నుండి కూడా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు 13 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 57.33 కోట్ల షేర్ , 104.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.