"దసరా" ఆ నిర్మాతకు ఊపిరి పోస్తుందా ?
అయితే ఈ సినిమా విషయంలో ఒక్క నెగటివ్ పాయింట్ మాత్రం చిత్ర బృందాన్ని చాలా నిరాశకు గురి చేస్తోంది. అదేమిటో ఇప్పుడు చూద్దాము. ఈ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఏంటో అభిరుచి కలిగిన వారు కావడం గమనార్హం. అందుకే తెలుగు ప్రేక్షకుల ముందుకు మంచి కథలను సినిమాలుగా నిర్మించి తీసుకువచ్చారు. ఈ సినిమాలలో పడిపడి లేచే మనసు, ఆడాళ్ళూ మీకు జోహార్లు, విరాటపర్వం, రామారావు ఆన్ డ్యూటీ లు ఉన్నాయి. కానీ ఈ సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎటువంటి ఫలితం ఎదురయ్యింది అనేది అందరికీ తెలిసిందే. కానీ వరుస ప్లాప్ లు వచ్చినా సుధాకర్ పట్టు వదలకుండా మరో వినూతనమైన కథను తీసుకువస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ , పాటలు ఆకట్టుకున్నా నిర్మాతకు ఎక్కడో తెలియని భయం అయితే ఉంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఈ డైరెక్టర్ పై నమ్మకంగా ఉన్నారు.. ఎందుకంటే సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేయడం మూలాన... తన మేకింగ్ స్టైల్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక పోస్టర్ లు టైటిల్ డిజైన్ అంతా పుష్ప లాగా ఉండడంతో పాజిటివ్ బజ్ ఉందని అంటున్నారు. మరి వరుస ప్లాప్ ల తర్వాత కనీసం ఈ సినిమా అయినా హిట్ అయ్యి తనకు ఊపిరి పోస్తుందా చూడాలి.