తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు ఆయన కార్తీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న ఈ హీరో యుగానికి ఒక్కడు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత నుండి ఈ హీరో నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా కార్తీ "సర్దార్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కార్తీ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా , పి ఎస్ మిత్రన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన భారీ ఎత్తున తమిళ్ తో పాటు తెలుగుcలో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సర్దార్ మూవీకి సెన్సార్ బోర్డు సభ్యుల నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. సర్దార్ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సర్దార్ మూవీ 2 గంటల 46 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న సర్దార్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.