అన్ స్టాపబుల్ టాక్ షోకు విచ్చేసిన ఆ యంగ్ ప్రొడ్యూసర్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆన్ స్టాపబుల్ టాక్ షో విజయవంతంగా మొదటి సీజన్ ను పూర్తి చేసుకుంది. కెరియర్ లో బాలకృష్ణ మొట్ట మొదటి సారి అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించినప్పటికీ తన అద్భుతమైన వాక్చాతుర్యంతో సీజన్ 1 ను అద్భుతమైన విజయం సాధించాల చేశాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 విజయవంతంగా ప్రారంభం అయింది. సీజన్ 2 కు మొదటి గెస్టులుగా నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు విచ్చేశారు. వీరితో బాలకృష్ణ అనేక విషయాలను ముచ్చటించాడు. ప్రస్తుతం అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని మొదటి ఎపిసోడ్ ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.
 

సీజన్ 2 లో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ హీరోలుగా కొనసాగుతున్న విశ్వక్ సేన్ ,  సిద్దు జొన్నలగడ్డ కూడా ఒక ఎపిసోడ్ కి రాబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఆన్ స్టాపబుల్ సీజన్ 2 లో భాగంగా ఒక యంగ్ ప్రొడ్యూసర్ కూడా ఈ షో లో భాగం కానున్నాడు. సూర్యదేవర నాగ వంశీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన నిర్మాతగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అన్ స్టాపబుల్  సీజన్ 2 లోని ఒక ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా రానున్నాడు. ఆల్రెడీ సూర్యదేవర నాగ వంశీ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. తాజాగా సూర్యదేవర నాగ వంశీ "అన్ స్టాపబుల్" సెట్ లో బాలకృష్ణ తో ఉన్న ఫోటోలు షేర్ చేశాడు ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: