మరో కొత్త దర్శకుడితో రానున్న నాని...!!
కాగా నాని ప్రస్తుతం దసరా సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల కానుందట.కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట..
ఈ సినిమాలో ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాని లైన్ లో పెట్టే పనిలో పడ్డారట నాని. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం నాని తన కొత్త సినిమా ద్వారా కొత్త దర్శకున్ని పరిచయం చేయనున్నట్లు వార్తలు జోరుగా అయితే వినిపిస్తున్నాయి. అయితే దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే ఒక కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాని తదుపరి సినిమాతో కూడా మరొక కొత్త దర్శకుడుని పరిచయం చేయబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నాని కొత్త సినిమాకు మోహన్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారట.
కొత్త దర్శకుడు నానికి కథ వినిపించగా వెంటనే ఆయన ఓకే చేశాడట.
ఆ కథ నాని కెరియర్లు ఇంతకుముందు ఎప్పుడు లేని డిఫరెంట్ స్టోరీలైన్ తో ఉండనుంది అని టాలీవుడ్ సినీ వర్గాలలో వార్తలు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. అయితే నాని దసరా అలాగే తన కొత్త సినిమా ద్వారా ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయనున్నారు. మరి ఈ విషయంలో నాని ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి. ఆ కొత్త దర్శకులకు నాని లైఫ్ ఇవ్వనున్నారా లేదా తెలియాలి అంటే వేచి చూడాల్సిందే గా మరీ.