"మెగా 154" మూవీ సంక్రాంతికి కష్టమేనా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉండగా , ఈ మూవీ లో శృతి హాసన్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తూ ఉండగా ,  మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడు.


మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ లో హీరోగా నటించడం ,  మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ మూవీ కి చిత్రం బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చిరంజీవి కెరియర్ లో 154వ మూవీ గా రూపొందుతూ ఉన్న నేపథ్యంలో  ,  ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.


మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ టైటిల్ ను విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం మెగా 154 మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా 154 మూవీ కి సంబంధించిన పనులు సంక్రాంతి వరకు పూర్తి కావడం కష్టమే అని ,  దానితో ఈ సినిమా సంక్రాంతి కి విడుదల అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: