ఇప్పుడైనా అంజలికి వర్క్అవుట్ అవుతుందా..!!

Divya
తెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఎదగాలని ఎంత ప్రయత్నించినా కూడా ఈమె సక్సెస్ కాలేకపోతోంది. తమిళ చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్ లో మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోతోంది. అయినప్పటికీ కూడా తెలుగులో వచ్చిన అవకాశాలని వదులుకోకుండా కష్టపడి నటిస్తూ ఉన్నది క్రమంలో ఓటీటి లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ.

నవరస అనే నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ తో డిజిటల్ స్పేస్ లో అడుగు పెట్టిన  అంజలి ఇప్పుడు తాజాగా ఝాన్సీ అనే వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ గా పేర్కొనబడిన ఈ సిరీస్ మునుపేన్నడు చూడడాని విదంగా అంజలి కనిపించబోతోంది. డిస్నీ హాట్ స్టార్ లో ఓటీటిలో విడుదల కాబోతున్న ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ట్రైలర్ కూడా తాజాగా విడుదల కావడం జరిగింది. ఈ సైకాలజికల్ అంశాలు యాక్షన్ సన్నివేశాలు ఈ ట్రైలర్ ని చాలా ఆసక్తి కలిగించేలా చేస్తున్నాయి. ఇక ఇందులో అంజలి తన గతాన్ని మర్చిపోయి వాటి గురించి చెడు కలల కనే అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం అంజలి ఎన్నో యాక్షన్ స్టాంట్స్ చేసినట్లుగా కూడా కనిపిస్తోంది.
ఝాన్సీ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో అక్టోబర్ 27న స్ట్రిమ్మింగ్ కు సిద్ధంగా ఉంది. దీనిని తీరు దర్శకత్వం వహించారు. ది ఫ్యామిలీ మెన్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఈ చిత్రానికి యాక్సిడెంట్ ఎపిసోడ్లను డిజైన్ చేయడం జరిగింది. ఇందులో అంజలితో పాటు అబ్ రామ్, ఆదర్శ బాలకృష్ణ, చాందిని చౌదరి, కళ్యాణ్ మాస్టర్ ,ముమైత్ ఖాన్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మరొకవైపు అంజలి రామ్ చరణ్ తో కలిసి తన 15వ సినిమాలో నటిస్తూ ఉన్నది. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎంతో భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: