"పుష్ప 3" విషయంలో ఆలోచనలో పడ్డ సుకుమార్...!!

murali krishna
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో  గా సుకుమార్ దర్శకత్వం లో ఈ మధ్య నే ప్రేక్షకు ల ముందు కి వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్".
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎర్ర చందనం నేపథ్యం లో సాగే కథ గా తెరకెక్కింది. ఇందు లో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్ర లో తన అద్భుత మైన నటన తో అందరి దృష్టి ని ఆకర్షిం చారు. భారీ అంచనాల మధ్య విడు దలైన ఈ సినిమా బాక్సా ఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టిం చింది. తెలుగు లో మాత్రమే కాక హిందీ లో కూడా ఈ సినిమా మంచి విజ యాన్ని సాధించింది. ఇక తాజా గా ఈ సినిమా రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" గురించి అభి మానులు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
తాజా గా ఈ చిత్ర నెక్స్ట్ పార్ట్ గురించిన ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారు తుంది. "కే జి ఎఫ్ 2" సమయం లో ప్రశాంత్ నీల్ సినిమా కి సీక్వెల్ లేదని స్పష్టం చేశారు కానీ సినిమా ఆఖరి సన్నివేశం లో మాత్రం "కేజిఎఫ్ 3" కూడా ఉండబోతోంది అని ప్రేక్షకులు ఊహించుకు నేలా చేశారు. అయితే పుష్ప విషయంలో కూడా అదే చేస్తే బాగుంటుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. "పుష్ప 3" సినిమా చేయడం చేయకపోవడం పక్కనపడితే "పుష్ప 2" ఆఖరి లో సీక్వెల్ ఉంటుంది అనే ఆలోచన ప్రేక్షకుల కు ఇస్తే బాగుం టుంది అని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఆఖరి సన్నివేశం ఎలా రాస్తే బాగుంటుంది అని సుకుమార్ విభిన్న రకాలుగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: