విశ్వక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్...!!
యంగ్ హీరో విశ్వక్ సేన్ (మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ఓరి దేవుడా' (Ori Devuda). విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ఓ కీలక పాత్రలో నటించగా.. అశ్వత్ మారి ముత్తు (Ashwath Marimuthu) దర్శకత్వంలో ప్రసాద్ వి. పొట్లూరి (PVP) నిర్మించారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకాబోతోన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం రాజమండ్రిలో నిర్వహించారట.ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''పీఆర్వోగా నాతో ఎన్నో సినిమాలు చేసిన వంశీ.. ఈ చిత్రంతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారారు. ఆయనకు ఆల్ ది బెస్ట్. పీవీపీ సంస్థ ఎప్పుడూ మంచి చిత్రాలను నిర్మిస్తుంటుంది. అశ్వత్ గారి ఒరిజినల్ సినిమాను చూడలేదు.. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. మా వెంకటేష్ గారు చేసిన రోల్ చాలా ఇంపాక్ట్‌గా ఉందట.. వెంకటేష్ అన్న కోసమైనా ఈ చిత్రం చూస్తాను. మిథిలా పాల్కర్‌కు నేను, నా భార్య అభిమానులం. ఆమె ఓటీటీ సూపర్ స్టార్. ఆశాకు ఆల్ ది బెస్ట్. విశ్వక్ విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గల్లీగల్లీలో విశ్వక్ సేన్ అంటే తెలియని వారుండరు. ఆయనకు అంతటా కూడా అభిమానులున్నారు. 'ఫలక్‌నుమా దాస్' సినిమా నేనూ చూశాను. యూత్, రెబల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉంటారు. హీరోగా కంటే కూడా.. ఆయన పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని. ఇచ్చిన మాట కోసం నిలబడే వారంటే నాకు ఇష్టం. నేనలా ఉంటానని అంతా అంటుంటారు. మంచో చెడో.. మాట ఇస్తే.. విశ్వక్ సేన్ నిలబడతాడు. నమ్మినదాని కోసం నిలబడటం, పక్క వారి కోసం, స్నేహితుల కోసం నిలబడటం అనేది పెద్ద అచీవ్‌మెంట్. రజినీకాంత్‌గారు, పవన్ కళ్యాణ్‌గారు, చిరంజీవిగారు వంటి వారి సినిమాలు హిట్ అవుతాయ్.. ఫ్లాప్ అవుతాయి.. కానీ ఎల్లప్పుడూ వారు సూపర్ స్టార్‌గా ఉంటున్నారంటే.. పర్సనల్‌గా వారి పర్సనాలిటీనే కారణం. విశ్వక్.. నువ్వు కూడా అలానే ఉండాలి. ఈ చిత్రం అక్టోబర్ 21న రాబోతోంది. ఈ దీపావళికి ఈ సినిమా బాగుంటుందా? ఈ సినిమా వల్ల దీపావళి బాగుంటుందా? నాకు తెలియదు గానీ మీ అందరి ఆశీస్సులు అయితే వారికి ఉండాలి. నేను మాత్రం ఈ సినిమా చూస్తాను. మంచి ఫీల్ ఉన్న చిత్రం. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. రాజమండ్రికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫంక్షన్ ఇక్కడ జరుగుతోంది. 'రంగస్థలం' సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడు 'ఉప్పెన' ఫంక్షన్ కూడా పెట్టారు. అది వంద కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు