జూనియర్ ఎన్టీఆర్ ని మోసం చేసింది ఎవరో తెలుసా....?

murali krishna
తెలుగు సినీ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా గుర్తింపు పొందడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇకపోతే ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే. అనవసరంగా ఎలాంటి విషయాలలో కూడా తల దూర్చడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టివ్గా కనిపించరు. కేవలం ఏదైనా సందర్భాలలో మాత్రమే స్పందిస్తూ ఉంటారు.
అయితే ఎవరి జోలికి వెళ్లరు. కానీ తన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టరు ఎన్టీఆర్ .. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నచ్చే క్వాలిటీ కూడా అదే అని చెప్పవచ్చు. అలా ఎన్టీఆర్ ఎవరైనా సరే ఏదైనా సహాయం కోసం చేయి చాచి అడిగితే ఎలాంటివారికైనా సహాయం చేస్తూ ఉంటారట. అయితే అలా ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ ని అడ్డుపెట్టుకొని ఎన్టీఆర్ ను మోసం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్ లో ఎక్కువగా నమ్మిన వారిలో ఒకరు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎన్టీఆర్ ని దారుణంగా మోసం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ కెరియర్ ప్రారంభం నుంచి .. ఎన్టీఆర్ తో పాటు కొనసాగుతూ వచ్చిన అతను సింహాద్రి సినిమా హిట్ తర్వాత తారక్ రేంజ్ ఒకసారిగా మారిపోయింది. ఇక ఆ హీరో ఎన్టీఆర్ పేరు చెప్పుకొని కొందరి దగ్గర డబ్బులు తీసుకున్నారట. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి కూడా చెప్పకుండా చేశారట. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ నటించిన సాంబ, నా అల్లుడు, ఆంధ్రావాలా వంటి సినిమాలు ఘోరంగా పరాజయాన్ని చూశాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఇక ఆ సమయంలోని ఎన్టీఆర్ స్నేహితుడికి అప్పులు ఇచ్చిన ప్రజల సైతం ఎన్టీఆర్ మీద పడి మీ స్నేహితుడు నీ పేరు చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మీ మార్కెట్ పడిపోయింది మాకు మీ మీద నమ్మకం లేదు . మాడబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారట. దాంతో ఎన్టీఆర్ చేసేదేమీ లేక తన దగ్గర ఉన్న డబ్బులను వారికి ఇచ్చేశారట. అయితే ఆ వెంటనే ఆ ఫ్రెండ్ వచ్చి ఎన్టీఆర్ ను క్షమించమని అడగగా.. తన పేరు వాడుకొని తనని మోసం చేశారని ఎప్పటికీ ఇక తనతో మాట్లాడనని జూనియర్ ఎన్టీఆర్ అతన్ని దూరంగా పెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: