టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్
మూవీ `గాడ్ ఫాదర్`.
తమిళ డైరెక్టర్
మోహన్ రాజా భారీ మార్పులు చేర్పులతో తెరకెక్కించిన ఈ మూవీని మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా
రీమేక్ చేశారు. అయితే రీసెంట్ గా దసరాకు విడుదలైన ఈ
మూవీ మంచి టాక్ ని సొంతం చేసుకున్నా ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోతోంది.దానికి ప్రధాన కారణం.. ఈ మూవీకి ఒరిజినల్ అయిన `లూసీఫర్` తెలుగులో ఒటీటీ ప్లాట్ ఫామ్ తో పాటు
యూట్యూబ్ లోనూ అందుబాటులో వుంది. ఇప్పటికే 90 శాతం మంది ఈ మూవీని చూసేయడంతో `గాడ్ ఫాదర్`ని థియేటర్లలో చూడటానికి పెద్దగా ఎవరూ ఆసక్తిని చూపించడం లేదు. ఇదే ఈ మూవీకి ప్రధాన సమస్యగా మారింది.
రీమేక్ అంటే ఎక్కడా అందు బాటులో లేని సినిమాని
రీమేక్ చేస్తే దాన్ని చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో వుంటుంది.అలా కాకుండా ఒరిజినల్ అందుబాటులో వుండగానే దాన్ని
రీమేక్ చేస్తే ఇదుగో ఇలాంటి ఫలితాలనే ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రేడ్ వర్గాలు వాపోతున్నాయి. ఇక `గాడ్ ఫాదర్` పరిస్థితి ఇలా వుంటే హిందీలో
రీమేక్ అయిన `విక్రమ్ వేద` పరిస్థితి కూడా ఇలాగే వుంది.
హృతిక్ రోషన్ సైఫ్ అలీఖాన్ ల కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీని
తమిళ హిట్
మూవీ `విక్రమ్ వేద`కు
రీమేక్ గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన ఈ
మూవీ బాలీవుడ్ లో ఎలాంటి ఇంపాక్ట్ ని కలిగించలేకపోయింది.కారణం `విక్రమ్ వేద`
తమిళ వెర్షన్ ఇప్పటికే పలు ఓటీటీలలో
హిందీ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో వుండటమే. మేకర్స్ తో పాటు హీరోలు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ రెండు
రీమేక్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించకపోగా రికవరీ కూడా కష్టంగా మారడంతో
రీమేక్ లపై ట్రేడ్ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఈ రెండు సినిమాలు
రీమేక్ ల విషయంలో
నిర్మాత హీరోలకు భారీ గుణపాఠాన్ని నేర్పాయని ఇకపై భవిష్యత్తులో
రీమేక్ లు చేస్తే వీళ్ళకంటే తెలివి తక్కువోల్లు ఎవరు ఉండరని
నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.