ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసర రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.
ఫాహద్ ఫాజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా , సునీల్ , అనసూయ , రావు రమేష్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళం విడుదలైన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇలా ఇప్పటికే పుష్ప ది రైస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా పుష్ప ది రూల్ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ క్లైమాక్స్ సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప ది రూల్ మూవీ క్లైమాక్స్ మూడవ పార్ట్ కోసం ఒక ట్విస్ట్ ఉంటుంది అని , పుష్ప ది రూల్ మూవీ తో పుష్ప సిరీస్ ముగియడం లేదు అని , ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.