"ఊర్వశివో రాక్షసివో" మూవీ సెకండ్ సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే హీరోగా అనేక మూవీ లలో నటించిన అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గౌరవం మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన అల్లు శిరీష్ ఆ తర్వాత పలు మూవీ లలో హీరో గా నటించాడు. అందులో భాగంగా శ్రీరస్తు శుభమస్తు మూవీ తో అల్లు శిరీష్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటికే ఈ ఒక సాంగ్ ను విడుదల చేసింది.
 


ఆ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రెండవ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ నుండి రెండవ పాట మాయారే ను అక్టోబర్ 17, 2022 న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి రాకేష్ శశి దర్శకత్వం వహించగా ,  ఈ మూవీ ని GA2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ల పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన ధియేటర్ లలో విడుదల చేయనున్నారు ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: