సినీ ఇండస్ట్రీలో విషాదం ప్రముఖ నటుడు మృతి...!!

Divya
హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. హ్యారీ పోటర్ చిత్రంలో నటించిన స్కాటిష్ నటుడు రాబి కొల్ట్రెన్ మృతి చెందడం జరిగింది.స్కాట్లాండ్లో ఒక ప్రముఖ ఆసుపత్రిలో నిన్నటి రోజున తుది శ్వాస విడిచారు. అయితే ఈ నటుడు మరణించడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. రాబి మరణం పట్ల పలువురు హాలీవుడ్ సినీ ప్రముఖుల సైతం సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం ఈ చిత్రాల్లోనే కాకుండా యాక్షన్ డ్రామా జేమ్స్ బాండ్ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి పేరు సంపాదించారు అయితే ప్రపంచ వ్యాప్తంగా మాత్రం హ్యారీ రిపోర్టర్ సినిమాతో మంచి పేరు సంపాదించారు.

2001 నుంచి 2011 విడుదలైన మొత్తం 8 చిత్రాలలో బాల మాంత్రికుడి గురువుగా కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు అలాగే పియర్స్ బ్రాస్నతో కలిసి గోల్డెనీ ది వరల్డ్ నాట్ ఎఫన్ రెండు జేమ్స్ బాండ్ వంటి చిత్రాలలో నటించారు. ఇక క్రాకర్ డ్రామాలు హార్ట్ బీటన్ పాత్రకు గాను మూడు సంవత్సరాల బ్రిటిష్ అకాడమీ టెలివిజన్ అవార్డులో ఉత్తమ నటుడుగా కూడా 10 అవార్డులను సొంతం చేసుకున్నారు అయితే చివరిగా హ్యారీ పాటర్ 20వ వార్షికోత్సవం రిటర్న్ టు హాగ్వార్డులో కనిపించడం జరిగింది.

హ్యారీ పాటర్ రచయిత జేకే రౌలింగ్ తన ట్విట్టర్ వేదికగా ఈ నటుడుకి నివాళులు అర్పించారు. నేను రాబి లాంటి వ్యక్తిని మరల ఎప్పటికీ కలుసుకోలేను అతను ఒక అద్భుతమైన నటుడు అతనితో కలిసి పనిచేయడం మళ్ళీ తనను కలుసుకొని అదృష్టం నాకు లేదు నేను నా ప్రేమను పూర్తిగా అతనితో పంచుకున్నాను అతని కుటుంబానికి అతని పిల్లలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ తెలియజేశారు. ఏది ఏమైనా ఇలాంటి గొప్ప నటుడిని హాలీవుడ్ ఇండస్ట్రీ కూలిపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ నటుడు మరణానికి గల కారణాలు ఏంటి అనే విషయం మాత్రం ఇంకా అభిమానులలో సందేహంగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: