పెళ్లి వార్తలపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. క్లారిటీ ఇవ్వాలంటూ స్టార్ హీరోయిన్ ఫైర్.!
దీనిపై తాజాగా రకుల్ స్పందించింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో దూసుకుపోతోంది. బాలీవుడ్ నటుడు, తన ప్రియుడు జాకీ భగ్నానీని అభిమానులకు పరిచయం చేసినప్పటి నుంచి తెలుగులో పెద్దగా చిత్రాలేవీ చేయడం లేదు. హిందీ ఫిల్మ్స్ లోనే నటిస్తూ వస్తోంది.
ఈ ఏడాది ఆరంభం నుంచే రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. చాలా ఓపెన్ గా ఫంక్షన్లకు, ఆయా ఈవెంట్లతో పాటు టూర్లకు కూడా వెళ్తూ సందడి చేస్తున్నారు. పార్టీలు, పబ్బులకూ వెళ్తూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి పెళ్లి ఎప్పుడనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.
ఇదే విషయంపై రీసెంట్ గా రకుల్ ప్రీత్ సోదరుడు ఆమాన్ ప్రీత్ సింగ్ నోరువిప్పారు. రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రకటించారు. దీంతో ఇంటర్నెట్ లో ఒక్కసారిగా రకుల్ ప్రీత్ పెళ్లి వార్త వైరల్ గా మారింది.
రెండు రోజుల నుంచి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ నెట్టింట వార్తలు తెగ పుట్టుకొస్తున్నాయి. స్టార్ హీరోయిన్ కావడంతో తన పెళ్లివార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా ఈ విషయం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ కూడా తన పెళ్లి వార్తలపై స్పందించింది.
'సోదరుడా ఆమాన్ ప్రీత్ నువ్వే కన్ఫమ్ చేశావా? నా పెళ్లి గురించి కనీసం నాకైనా చెప్పాలి కదా బ్రో.. ఏంటో నా జీవితం గురించి నాకే తెలియడం లేదు.!' అంటూ స్మైల్ ఎమోజీతో స్పందించింది. దీనిపై ఆమాన్ కూడా స్పందిస్తూ 'తెలిసింది.. చెప్పాను' అంటూ ఓపెన్ గా కామెంట్ చేశారు. దీంతో సరదాకే ఆమాన్ ఇలా చేశాడని తెలుస్తోంది.
ఏదేమైనా రకుల్ ప్రీత్ పెళ్లి వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో దుమారం రేపింది. కేరీర్ పట్ల ఎంతో శ్రద్ధగా ఉండే ఈ బ్యూటీ అప్పుడే మ్యారేజ్ తో ప్రేక్షకులకు దూరంగా కానుందా అని అభిమానులు కూడా కంగారు పడ్డారు. రకుల్ స్పందనతో ఇప్పుడప్పుడే పెళ్లి వార్త లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రకుల్, ఆమాన్ ప్రీత్ వైరల్ అవుతున్నాయి.