'ఆదిపురుష్ ' యానిమటెడ్ మూవీ.... టీజర్ ని చూడగానే మోసం చేసినట్లు అనిపించింది....!!
మంచు విష్ణు తాజాగా 'జిన్నా' లో నటించాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు.''నేను ఓ తెలుగు వ్యక్తి మీద నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. లైవ్, యాక్షన్‌గా రామాయణాన్ని రూపొందిస్తున్నారని మేం అందరం అనుకున్నాం. యానిమేషన్ చిత్రాన్ని ఎవరూ ఊహించలేదు. అందువల్ల ప్రతి ఒక్కరు నిరుత్సాహపడ్డారు. మేకర్స్ ముందుగా యానిమేటెడ్ సినిమాను రూపొందిస్తున్నామని చెప్పి, టీజర్‌ను విడుదల చేస్తే జీరో ట్రోల్స్ వచ్చేవి. ప్రేక్షకులను ప్రిపేర్ చేయకుండా, మోసం చేస్తే ఈ విధంగానే స్పందిస్తారు. ప్రభాస్ రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న మూవీలో నటిస్తున్నాడు. 'తానాజీ' కి దర్శకత్వం వహించిన ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అందవల్ల నేను గ్రాండ్‌గా ఊహించుకున్నాను. ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆకస్మాత్తుగా మేకర్స్ వచ్చి యానిమేషన్ చిత్రాన్ని చూపిస్తే ప్రేక్షకులు ఈ విధంగానే స్పందిస్తారు '' అని మంచు విష్ణు తెలిపాడు. 'ఆది పురుష్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది. హీరోయిన్ కృతి సనన్ డబ్బింగ్‌ను ఇప్పటికే మొదలుపెట్టింది.