యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు దగ్గరికి వస్తోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల యొక్క పుట్టిన రోజు సందర్భంగా వారి యొక్క పాత సినిమాల రీ రిలీజ్ చూస్తున్నాం.అయితే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలే. సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ద్వారా మంచి పాపులారిటీని.. మరింతగా వసూళ్లని సొంతం చేసుకుంటున్నారు. అయితే
ప్రభాస్ అభిమానులు మాత్రం ఆయన నటించిన ఫ్లాప్
సినిమా ను పుట్టిన రోజు సందర్భంగా రిలీస్ చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.
ప్రభాస్ హీరోగా నటించిన రెబల్
సినిమా ని రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున
సినిమా యొక్క షో లు పడబోతున్నట్లుగా
రెబల్ స్టార్ అభిమానులు పేర్కొన్నారు. ఉన్నట్లుండి
ప్రభాస్ ఫ్లాప్
సినిమా ఎందుకు లైన్ లోకి వచ్చింది అంటూ చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో కొందరు ఈ విషయమే స్పందిస్తూ రెబల్ సినిమాలో
ప్రభాస్ తో పాటు కృష్ణంరాజు కూడా నటించారు. పెదనాన్న
ప్రభాస్ కలిసి నటించిన
సినిమా అవడంతో ఈ సినిమాను ఈ ఏడాది రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వారు తెలియజేశారు. ఇటీవల పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన విషయం తెలిసిందే.అందుకే ఆయన నటించిన
సినిమా అది కూడా
ప్రభాస్ తో కలిసిన నటించడం
సినిమా విడుదల చేస్తే అభిమానులకు ఒకింత సంతృప్తి కలుగుతుందని.. మళ్లీ ఇద్దరినీ
వెండి తెరపై కలిసి చూడలేం కనుక రెబల్ సినిమాతో వారిద్దరిని అభిమానులు ఒకసారి చూడాలని కోరుకుంటున్నట్లుగా సమాచారం అందుతుంది.
ప్రభాస్ మరియు కృష్ణంరాజు కలిసి నటించిన రెబల్
సినిమా యొక్క షో లు భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో పడుతున్నాయి. కనుక ఎక్కువ శాతం అభిమానులు సినిమాను చూసే అవకాశం దక్కుతుంది. మరి వసూళ్ల విషయంలో గత రికార్డులను బ్రేక్ చేస్తారా చూడాలి.