యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే
ఎన్టీఆర్ , బుచ్చిబాబు సన కాంబినేషన్ లో ఒక
మూవీ రాబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ , బుచ్చిబాబు కాంబినేషన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక
సినిమా రానున్నట్లు , మరి కొన్ని రోజుల్లోనే ఆ
మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత
ఎన్టీఆర్ ,
కొరటాల శివ తో ఒక
మూవీ కి కమిట్ అయిన విషయం మనకు తెలిసింది.
కొరటాల శివ
మూవీ తర్వాత
ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్నాడు. ఈ రెండు
మూవీ ల తర్వాత బుచ్చిబాబు తో
ఎన్టీఆర్ మూవీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే
ఎన్టీఆర్ మూవీ కోసం బుచ్చిబాబు కూడా చాలా రోజుల పాటు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎలా ఉంటే ఇప్పటికే
ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్క బోయే
మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సింది. కాకపోతే ఇప్పటివరకు కూడా ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. అలాగే మరి ఒక రెండు , మూడు నెలలు ఈ
సినిమా స్టార్ట్ కావడానికి సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అలా
ఎన్టీఆర్ 30 వ
సినిమా డిలే అవుతూ రావడంతో బుచ్చిబాబు వేరే హీరోతో ముందుగా ఒక
మూవీ ని చేయాలని , ఆ తర్వాత
ఎన్టీఆర్ తో
మూవీ చేయాలని డిసైడ్ అయినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ప్రకారం బుచ్చిబాబు వేరే హీరోతో మొదట
సినిమా చేస్తాడా ... లేక
ఎన్టీఆర్ తో
మూవీ చేయడానికి వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.