తాజాగా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి కాంతారా అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన కాంతారా మూవీ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అద్భుతమైన రీతిలో ఉండడంతో , ఈ మూవీ ప్రస్తుతం కన్నడ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుని , అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇలా ఇప్పటికే కన్నడ సినీ ప్రేమికుల మనసు దోచుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధిస్తున్న ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు.
తెలుగు లో ఈ మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు , ఇప్పటికే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా ఈ మూవీ లో హీరోగా నటించిన రిషబ్ శెట్టి మరియు చిత్ర కథానాయిక సప్తమి గౌడ హాజరయ్యారు.
ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా రిషబ్ శెట్టి ని తెలుగు లో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని ప్రశ్నించగా ... రిషబ్ శెట్టి ఈ ప్రశ్నకు నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ జూనియర్ ఎన్టీఆర్ అని సమాధానం ఇచ్చాడు. అలాగే తెలుగు నుండి రామ్ చరణ్, మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ కూడా తనకు ఇష్టమని మరియు వారు ఇక్కడ పెద్ద స్టార్స్ అని రిషబ్ చెప్పాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కన్నడ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కాంతారా సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.