ఈ ఏడాది 400 కోట్లు వసూళ్లు రాబట్టిన మూవీలు ఇవే?
ఈ ఏడాది 400 కోట్లు వసూళ్లు అందుకున్న సినిమాలు మొత్తంగా ఐదు ఉన్నాయి. అయితే అందులో కేవలం ఒకే ఒక బాలీవుడ్ సినిమా ఉండడం విశేషం. మిగతా నాలుగు సినిమాలు కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందినవే.ఇక మొదట అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో కేజిఎఫ్ సెకండ్ పార్ట్ నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1250 కోట్ల గ్రామస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక దీని తర్వాత rrr సినిమా అత్యధికంగా 1175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది 1000 కోట్లు దాటిన సినిమాలలో ఈ రెండు మాత్రమే నిలిచాయి. ఇక విక్రమ్ సినిమా అయితే 450 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఇక కమలహాసన్ కూడా ఇదే సినిమాతో మళ్ళీ తెలుగులో తన సత్తా చాటారు. రీసెంట్ గా వచ్చిన మరొక తమిళ సినిమా పొన్నియిన్ సెల్వబ్ కూడా బాక్సాఫీస్ వద్ద అయితే పర్వాలేదు అనిపించింది.
ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మొత్తంగా నిర్మాతలు అయితే సేఫ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 400 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. మొత్తానికి మణిరత్నం అయితే తన డ్రీం ప్రాజెక్టును విజయవంతంగా తెరపైకి తీసుకువచ్చాడు.ఇక ఈ లిస్టులో ఉన్న సినిమాలతో పాటు 400 కోట్లు దాటిన సినిమాలలో ఒకే ఒక్క బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర కూడా నిలిచింది. ఈ ఏడది హిందీలో అయితే తప్పకుండా ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా రక్షాబంధన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఈజీగా 400 కోట్లు రాబడతాయని అనుకున్నారు.కానీ బ్రహ్మాస్త్ర తప్పితే ఏ సినిమా కూడా ఆ స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు. కేవలం భూల్ బులయా అనే సినిమాతో పాటు ది కాశ్మీర్ ఫైల్స్ మాత్రమే 250 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ మొత్తంగా అయితే 340 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక సౌత్ నుంచే ఎక్కువ డామినేషన్ వుంది. ఈ నేపధ్యంలో త్వరలో విడుదల అవ్వోబోతున్న అక్షయ్ కుమార్ రామ్ సేతు సినిమా పై ఎన్నో భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ఇంకెన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో చూడాలి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.