మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన నటన తో , అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. అలా మొదటి మూవీ తోనే ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం వరస మూవీ అవకాశాలను దక్కించుకుంటుంది.
ఇప్పటికే శ్రీ లీల , రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేనిb, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో కూడా శ్రీ లీల ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం కొన్ని రోజులు మాత్రమే చేసింది.
ఇలా వరస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ముందుకు సాగిస్తున్న ఈ యంగ్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటిక ప్పుడు తన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
అందులో భాగంగా తాజాగా శ్రీ లీల తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో ఆరెంజ్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.