
తండ్రి డైరెక్టర్.. అక్క హీరోయిన్.. అయినా ఆమె కెరియర్ నాశనమైంది?
ఎవరికి సాధ్యం చేయని రీతిలో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సావిత్రి ఆ తర్వాత కాలంలో మాత్రం నిజజీవితంలో వేసిన కొన్ని తప్పటడుగులు కారణంగా కెరియర్ ని పూర్తిగా నాశనం చేసుకుంది.. ఇక అచ్చం ఇలాగే బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్ లలో శుభ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. శుభ తండ్రి వేదాంతం రాఘవయ్య. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు. దేవదాసు సువర్ణసుందరి అనార్కలి లాంటి బ్లాక్బస్టర్ సినిమాలను తెరకెక్కించారు.
ఇక ఈయన భార్య జెమినీ గణేషన్ మొదటి భార్య చెల్లి. అంటే జెమినీ గణేషన్ కు వేదాంతం రాఘవయ్య స్వయాన తోడల్లుడు అవుతాడు. అయితే మేటి హీరోయిన్ రేఖ జెమినీ గణేషన్ పుష్పవల్లి కూతురు కావడం గమనార్హం. అంటే శుభకు స్వయాన అక్క అవుతుంది. ఇలా చూసుకుంటే శుభకు ఇండస్ట్రీలో భారీ బ్యాక్ గ్రౌండ్ ఉంది అని చెప్పాలి. అయితే తెలుగు తమిళ భాషల్లో కెరియర్ స్టార్ట్ చేసింది ఈ హీరోయిన్. ఛాన్సులు కూడా బాగానే వచ్చాయి. సూపర్ హిట్ లు కూడా సాధించింది. తర్వాత మలయాళంలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది.
కానీ కెరియర్ హ్యాపీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలోనే రాంగ్ స్టెప్ వేయడం మొదలుపెట్టింది. మద్యానికి అలవాటు పడటంతో పాటు గుర్రపు పందాలకు బానిసగా మారిపోయింది.. ఇక అప్పట్లో స్టార్ హీరోయిన్ కావడంతో ఎక్కువగా డబ్బులు సంపాదించింది. ఈ క్రమంలోనే కట్టలకు కట్టలు డబ్బులు తీసుకొని పందాలలో కుమ్మరించేదట. చివరికి పందాలలో రావడం కాదు ఉన్నది మొత్తం పోగొట్టుకొని ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయింది. పెళ్లికి దూరంగా ఉంటూ ఒకరిద్దరితో సహజీవనం చేయడం కూడా కెరీర్ ను నాశనం చేసింది అన్న టాక్ కూడా ఉంది. ఇలా భారీ బ్యాగ్రౌండ్ ఉన్న చేజేతులారా కెరీర్ నాశనం చేసుకుంది హీరోయిన్ శుభ.