టాలీవుడ్
ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న మంచు విష్ణు తాజాగా జిన్నా అనే
మూవీ లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
సూర్య దర్శకత్వం వహించగా , సన్నీ లియోన్ , పాయల్ రాజ్ పుత్ ఈ
మూవీ లో మంచు విష్ణు సరసన
హీరోయిన్ లుగా నటించారు. ఈ
మూవీ ని
అక్టోబర్ 21 వ తేదీన తెలుగు , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో జిన్నా
మూవీ పై ప్రేక్షకులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జిన్నా
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి ఒక అప్డేట్ విడుదల చేసింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
మూవీ లో రఘుబాబు క్యారెక్టర్ కు సంబంధించిన
పోస్టర్ ని విడుదల చేసింది. రఘుబాబు ఈ
మూవీ లో రంగంపేట ప్రెసిడెంట్ తిప్పే స్వామి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియ జేస్తూ రఘుబాబు కు సంబంధించిన ఒక
పోస్టర్ ను జిన్నా
మూవీ యూనిట్ విడుదల చేసింది.