బాలీవుడ్ డిస్కౌంట్ ఆఫర్స్ ను పరిశీలిస్తున్న టాలీవుడ్ !

Seetha Sailaja

ప్రస్తుత పరిస్థితులలో సినిమా ధియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఒక సమస్యగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి భారీ పబ్లిసిటీ చేసి భారీ సినిమాలను విడుదల చేస్తున్నప్పటికీ ఆసినిమాలలో కేవలం రెండు శాతం సినిమాలు కూడ విజయవంతం అవ్వకపోవడం ఇండస్ట్రీ వర్గాలకు టెన్షన్ కలిగిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ అనుసరిస్తున్న ఒక కొత్త వ్యూహాన్ని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ చాల నిశితంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమధ్య దేశవ్యాప్తంగా జరిగిన జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ మూవీ టిక్కెట్ల ధరను తగ్గించి 75 రూపాయలకు మల్టీ ప్లెక్స్ ధియేటర్లలో అమ్మడంతో జనం విపరీతంగా రావడంతో ఈపద్ధతిని నవరాత్రి సీజన్ అంతా కొనసాగించి ‘బ్రహ్మాస్త్ర’ మూవీ బయ్యర్లు కొంత గట్టెక్కారు.


ఇప్పుడు ఇదే పద్ధతి లేటెస్ట్ గా విడుదలైన బాలీవుడ్ మూవీ ‘విక్రమ్ వేదా’ అనుసరిస్తోంది. ఈమూవీకి విమర్శకుల నుండి ప్రశంసలు లభించి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈమూవీ కనెక్షన్స్ ఆశించిన స్థాయిలో లేవు అన్నప్రచారం జరుగుతోంది. దీనితో ఈమూవీ బయ్యర్లు అక్టోబర్ 7నుండి ఈమూవీ టిక్కెట్ల ధరలలో 20 శాతం తగ్గించి ప్రేక్షకులను తమ ధియేటర్ల వైపు రప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈప్రయత్నం ఎలా ఉంటుందో ఈవీకెండ్ లో తేలిపోతుంది.


ఇప్పుడు ఈ ప్రయోగం సక్సస్ అయితే త్వరలో టాలీవుడ్ లో కూడ ఇలాంటి ప్రయోగం మన తెలుగు సినిమాలకు సంబంధించి కూడ అమలు చేసే అవకాశం ఉందని లీకులు వస్తున్నాయి. ఓవర్సీస్ లో భారీ స్థాయిలో విడుడలు చేసే మన టాప్ హీరోల సినిమాలకు టాక్ విషయంలో తేడా వచ్చినప్పుడు ఆసినిమాలను విడుదల చేసిన ఓవర్సీస్ బయ్యర్ తాను నష్టాల బాట పడకుండా ఆసినిమాకు సంబంధించిన టిక్కెట్ రేట్లను తగ్గించడం లేదంటే ఒక టిక్కెట్ కొన్నవారికి మరొక టిక్కెట్ ఫ్రీగా ఇస్తున్న పద్ధతి ఇప్పటికే కొనసాగుతోంది. ఇప్పుడు ఈపద్ధతి రానున్నరోజులలో తెలుగు రాష్ట్రాలలో కూడ అమలు అయ్యే ఆస్కారం ఉందా అంటూ కొందరి అంచనాలు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: