ఇ లవ్ బర్డ్స్ కష్టానికి తగ్గ ఫలితం లభించేనా..!!
ఈ చిత్రానికి మొదట ప్రేమ కాదంట అనే టైటిల్ నిర్వహించారు. అయితే ఆ టైటిల్ తో పాటు పోస్టర్‌ను కూడా అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ సమయంలో రకరకాల ప్రచారాలు జరగడంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడడం జరిగిందట. దీంతో ఇప్పుడు ఫ్రెష్ గా ఉండాలని ఉద్దేశంతో ఈ సినిమాని ఊర్వశివో రాక్షసివో అనే టైటిల్‌తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు చిత్ర బృందం. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అల్లు శిరీష్ మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోతున్నారని చెప్పవచ్చు.
ఒకవైపు తన అన్న పాన్ ఇండియా హీరోగా పేర్కొందుతూ ఉంటే తమ్ముడు మాత్రం కేవలం చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ సక్సెస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అల్లు శిరీష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా అను ఇమ్మానుయేల్ నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు మాత్రం ఇండస్ట్రీలో చాలా వైరల్ గా మారాయి. ఇక ఈ విషయం కూడా ఈ సినిమాకి కాస్త ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి ఈ సినిమాతో వీరి కెరియర్ మార్చుకుంటారేమో చూడాలి.