చరణ్ సినిమాకు తప్పని లీక్స్..పోస్టర్స్ వైరల్..

Satvika
ఇటీవల రామ్ చరణ్ ఆచార్య సినిమాలో తండ్రితో కలిసి నటించాడు..కానీ ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.దాంతో ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ఆర్‌సి 15..ఈ షూటింగ్ పనులు ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే..ఈ సినిమా పై రామ్ చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు..పెద్ద హీరోల సినిమాలు అంటే లీకులు ఉండటం మనం చూసే ఉంటాము..వాటి నుంచి తప్పించుకోవడం కోసం చిత్ర యూనిట్ భారీగా కట్టడి చేసినా ఎక్కడో చోట లీక్ అవ్వడం ఖాయం..



ఈ చిత్రంలోని ముఖ్యమైన సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. RC15 సెట్స్ నుండి నేరుగా స్నాప్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ లీకైన స్నాప్‌లలో రామ్ చరణ్ పీరియాడిక్ లుక్ లో ఉన్నాడు. అలాగే, అంజలి, ఒక పిల్లాడితో చరణ్ ఫ్యామిలీని చూడొచ్చే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ లీకైన పిక్స్ కూడా నాణ్యత లేనివి. అయినా ఈ HD ఫోటోలు RC15 సెట్స్‌లోని భద్రతా పరిస్థితిపై సందేహాన్ని కలిగిస్తుంది. ఈ లీక్ అయిన పిక్స్ ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా లీక్‌లు చిత్రానికి పెద్ద నష్టం కలిగిస్తున్నాయి. 



కొత్త షెడ్యూల్‌ సోమవారం మారేడుమిల్లి రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ జరుగుతుంది. ఈ షూటింగ్ కోసం ఇప్పటికే రాజమండ్రి చేరుకున్న రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ వారం పాటు సాగే చిన్న షెడ్యూల్‌ అని తెలుస్తోంది. లో ప్లాష్ బ్యాక్ సందర్భంగా వచ్చే సన్నివేశాలను ఈ సందర్భంగా చిత్రీకరించనున్నారని సమాచారం. చరణ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని.. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమనే టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వాయిదాలపర్వంలో నడుస్తున్న సమయంలో ఈ లీక్స్ మరింత తలనొప్పిగా మారాయి..ఇక ఇలాంటి వాటి పై శంకర్ టీమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: