ప్రభాస్ వాల్యూ పడిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..!!
ఇక అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నెంబర్ వన్ సినీ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇలాంటి ప్రభాస్ పై తన వ్యాల్యూ పడిపోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రముఖ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్.
తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న తమ్మారెడ్డి భరద్వాజ తరచూ సినిమాలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలపై స్పందిస్తూ తనదైన శైలిలో కాంట్రవర్సీలకు తెర తీస్తూ ఉంటారు. తాజాగా ప్రభాస్ ఆది పురుష్ టీజర్ పై కూడా స్పందించడం జరిగింది.. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా తెరకెక్కిస్తున్న రామాయణం ఇతిహాస గాథ ఆది పురుష్ కి సంబంధించి ఇటీవల టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ టీజర్ విడుదలైన తర్వాత మరుసటి రోజు నుంచి ఇప్పటివరకు ఎన్నో నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఆదిపురుష్ టీజర్ మీద జరిగిన ట్రోల్స్ అన్నీ కూడా విపరీతంగా ప్రభాస్ వాల్యూ ని కిందకు లాగాయని చెప్పడంలో సందేహం లేదు అని భరద్వాజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
యానిమేషన్ సినిమా, కార్టూన్ సినిమా అంటూ గోల చేస్తూ సోషల్ మీడియాలో భారీగా రచ్చ రచ్చ చేశారు అంతేకాదు రాముడు, రావణుడు, హనుమంతుడు గెటప్ విషయంలో కూడా భారీగా విమర్శలు వచ్చాయి. ఇక ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ ఆది పురుష్ ట్రైలర్ ఇటీవల చూసాను. ప్రభాస్ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుంది. అంతేకాదు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ముంబైలో చేస్తున్నారు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక ఈ ఒక్క సినిమా డిజాస్టర్ అయితే ప్రభాస్ వాల్యూ పూర్తిగా పడిపోతుంది అని కూడా ప్రభాస్ పై ఊహించని విధంగా షాకింగ్ కామెంట్స్ చేశారు తమ్మారెడ్డి.