ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరోగా నేషనల్
క్రష్ రష్మిక మందన
హీరోయిన్ గా
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైస్
మూవీ ఏ రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందో మనందరికీ తెలిసిందే. ఈ
మూవీ తెలుగు తో పాటు
తమిళ , కన్నడ , మలయాళ ,
హిందీ భాషల్లో విడుదల భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని , అలాగే అద్భుతమైన కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిం.ది
సమంత నటించిన ఈ స్పెషల్ సాంగ్ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
దానితో
సమంత "పుష్ప ది రైస్"
మూవీ లో చేసిన స్పెషల్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చుకుంది. ఇలా పుష్ప ది రైస్
మూవీ లోని స్పెషల్ సాంగ్ కి ఫుల్ క్రేజ్ రావడంతో పుష్ప ది రూల్
మూవీ లోను ఒక అదిరి పోయే స్పెషల్ సాంగ్ ని పెట్టాలని మూవీ యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మొదట పుష్ప ది రూల్
మూవీ లోని స్పెషల్ సాంగ్ లో
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ను ఫిక్స్ చేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత
కాజల్ అగర్వాల్ ను చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం మిల్కీ
బ్యూటీ తమన్నా ను
మూవీ యూనిట్ ఫైనల్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మిల్కీ
బ్యూటీ తమన్న అనేక
మూవీ లలో ఐటమ్ సాంగ్ లలో నటించి తన అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. మరోసారి మిల్కీ
బ్యూటీ తమన్న ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.