ఐదు వారాలకు.. చలాకి చంటి అంత తీసుకున్నాడా?
కింగ్ నాగార్జున టిఆర్పిని లేపడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్న చివరికి ఆయన వల్ల కూడా కావడం లేదు అని చెప్పాలి. టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారు ఊహించిన రీతిలో ఎలిమినేట్ అవుతూ ఉండడం కూడా బిగ్బాస్ అభిమానులకు షాక్ గురిచేస్తుంది. ఇప్పటికే జబర్దస్త్ ద్వారా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న చలాకి చాంటి కాస్త అందరిలో కెల్లా మంచి గుర్తింపు ఉన్న కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళాడు. చంటి టాప్ 3 లిస్టులో ఉంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఐదు వారాలకే చంటి చాప చుట్టేసాడు.
ఇక ఐదు వారాలకే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసాడు. అయితే అందరితో కలిసి.. అందరూ నా వాళ్ళు అనుకుంటూ ఉండటమే చంటి కి మైనస్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే చంటి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 5 వారాలకు గాను 10 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ఎలిమినేట్ అవ్వడానికి కారణం అందరికంటే ఎక్కువ రెమినేషన్ చంటి తీసుకున్నాడని అందుకే బయటకు పంపించారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. భారీ రెమినరేషన్ తీసుకుంటూ కంటెంట్ ఇవ్వకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడని బిగ్బాస్ మేనేజ్మెంట్ ఎలిమినేట్ చేసిందని కూడా అక్కడక్కడ టాక్ వినిపిస్తోంది.