పవిత్ర దేవాలయంలో మద్యం, నాన్ వెజ్.. నాగచైతన్య బృందంపై కర్రలతో దాడి....!!!

murali krishna
టాలీ వుడ్ క్యూట్ బాయ్ నాగచై తన్య చిత్ర బృందంపై దాడి జరిగింది. కర్ణాటక లోని మెల్కేటే గుడి ప్రాం తంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాంట్రవ ర్సీలకు దూరంగా..
తనపనే దో తానూ చేసుకునే చైతు అండ్ కోపై మేలుకోతే ప్రాంత స్థాని కులు అటాక్ చేశారు. ఇటీవల లాల్ సింగ్ చద్ధా, థ్యాంక్యూ మూవీస్ రిజల్ట్తో కాస్త డల్ అయినా వరుస సినిమా లతో బిజీగున్న నాగచై తన్య తాజా గా వెంకట్ ప్రభు దర్శకత్వం లో సినిమా చేస్తున్నా డు. ప్రస్తుతం కర్ణాటక లోని మెల్కేటే ప్రాంతం లో షూ టింగ్ జరగు తోంది. అక్కడ చారిత్రక దేవాల యంలో నాగ చైతన్య కు సినిమా కు సంబంధిం చిన సీన్స్ షూట్ చేస్తు న్నారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణం లో చిత్ర బృందం అప విత్ర పనులు చేశారన్నఆగ్రహం తో స్థాని కులు యూనిట్ పై దాడికి దిగారు.మాండ్యలో ని పాండవ పూర్ తాలూకా మేల్కోటే గ్రామానికి చెందిన స్థానికులు కర్రల తో వచ్చి దాడి చేసిన ఘటన ఇప్పు డు వైరల్ అవుతుంది. మేల్కోటే లోని ప్రసిద్ధ రాయగో పుర లొకేషన్‌కు సమీ పంలో చిత్రీకర ణ కోసం చిత్ర బృందం అక్కడ విడిడి చేశారు. దేవాలయ పరిసర ప్రాంతం లో ఓ బార్‌కు సంబం ధించిన సెట్ వేయడం పై స్థాని కులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ పెట్టి అప విత్రం చేశా రని స్థానికుల ఆరోపణ. ఆలయ ప్రాంగణం లో అలాంటి పనులు చేయోద్దన్న కనీస జ్ఞానం లేదా అంటూ దాడికి దిగి.. షూటింగ్ సామాగ్రిని ధ్వంసం చేసిన ట్టు సమాచారం. ఈ క్రమం లోనే చిత్ర యూనిట్తో వాగ్వివాదానికి దిగినట్లు తెలుస్తోంది.
దాడి సమయం లో నాగచైతన్య కూడా స్పాట్ లో ఉన్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: