ఆదిపురుష్ టీజర్ పై ఆగని ట్రోల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..

Satvika
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ బిజిగా ఉన్నాడు..డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, బాలివుడ్ బ్యూటీ కృతిసనన్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు.అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు స్పెషల్ ట్రీట్ అందిస్తూ.. అయోధ్యలోని సరయు నది తీరాన ఆదిపురుష్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‏ను ఈ టీజర్ నిరాశపరిచిందనే చెప్పుకొవాలి.


ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా ఎఎఫ్ఎక్స్ ఎక్కువైందని.. టీజర్ అస్సలు బాలేదంటూ డార్లింగ్ ఫ్యాన్స్ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు.అభిమానులు మాత్రమే కాకుండా సినీ విశ్లేషకులు సైతం టీజర్ పై విమర్శలు చేశారు. ఈ మూవీ టీజర్ పై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు డైరెక్టర్ ఓంరౌత్. సోషల్ మీడియాలో వస్తున్న ఫీడ్ బ్యాక్ గమనించానని.. ప్రజలు ఊహించినట్టుగానే ఉండబోతుందని.. మాపై నమ్మకం ఉంచాలని కోరారు.ఆదివారం ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓంరౌత్ మాట్లాడుతూ.. ' ప్రస్తుతం ఆదిపురుష్ టీజర్ పై వస్తున్న ప్రతికూల స్పందనలను చూస్తున్నాము. ప్రతి ఒక్కరు చెప్పినా విషయాలను మేము నోట్ చేసుకుంటున్నాము.


మాపై నమ్మకం ఉంచండి. ప్రేక్షకులే మాకు సుప్రీం. ఈ జనవరి 12న విడుదలయ్యే మిమ్మల్ని నిరాశపరచదని నేను హామి ఇస్తున్నాను. మీ అంచనాలను మేము సాకారం చేస్తాం..మా యూనిట్ పై కేవలం నమ్మకం ఉంచండి అంటూ చెప్పుకొచ్చారు.మిమ్మల్ని నిరాశపరచను అని హామి ఇస్తున్నాను. పవిత్రమైన రామాయణం.. బిగ్ స్క్రీన్ వినోదాన్ని ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది కేవలం మా కోసం తీసిన కాదు. మన భక్తి, శ్రద్ధ, మనం దేనికోసం నిలబడతామో అందుకు ప్రాతినిధ్యం వహించేది అని అన్నారు..దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: