దీపావళికి "ఎన్ బి కే 107" నుండి అదిరిపోయే అప్డేట్ రాబోతుందా..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని ఖరారు చేయకపోవడంతో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో , ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది.

ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తూ ఉండగా , దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి , ఆ త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగ వంతంగా ఫినిష్ చేసి ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్ బి కె 107 మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం ,  క్రాక్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: