చుడిదార్ లో రమ్య కృష్ణ గ్లామర్ మెరుపులు... తగ్గేదిలే అంటున్న స్టార్...!
సౌత్ ఆడియెన్స్ కు పరిచయం అవసరం లేని సీనియర్ హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. వందలాది తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై హీరోయిన్ గా మెప్పించడమే కాకుండా.. కీలక పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తోంది.
ప్రస్తుతం సౌత్ లోని అన్ని భాషల్లో వరుసపెట్టి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది రమ్యకృష్ణ. విభిన్న పాత్రలను పోషిస్తూ తన అభిమానులకు, ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లోనూ రచ్చ చేస్తోంది.
అప్పట్లో అందాలు ఆరబోసిన హీరోయిన్లలో రమ్యకృష్ణ పేరు ముందుగా వినిపిస్తుంది. బోల్డ్ సీన్లలోనూ రమ్యకృష్ణ మతిపోయేలా పెర్ఫామెన్స్ ఇచ్చి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఐదు పదుల వయస్సులోనూ వన్నె తగ్గని అందంతో అదరగొడుతోంది. కొద్ది నెలలుగా ఇంటర్నెట్ లోనూ సందడి చేస్తోంది.
సినిమాలతోనే కాకుండా టీవీ షోలతోనూ అలరిస్తున్న రమ్యకృష్ణ ఆ షోలను ప్రమోట్ చేసుకోవడం కోసం అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. చీరకట్టులో, చుడీదార్ లో దర్శనమిస్తూ మతిపోగొడుతోంది. గ్లామర్ మెరుపులతో కుర్రాళ్లను సైతం తనవైపు తిప్పుకుంటోంది.
ముఖ్యంగా యంగ్ హీరోయిన్లకు రమ్యకృష్ణ చేస్తున్న ఫొటోషూట్లు సవాల్ గా మారింది. వయస్సు పెరిగినా హాట్ నెస్ తగ్గకుండా ఫొటోలకు పోజులిస్తుడటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీంతో ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. గ్లామర్ ఫొటోలను లైక్ చేస్తూ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
రీసెంట్ గా తెలుగు ఆడియెన్స్ ను 'లైగర్'తో అలరించింది. ప్రస్తుతం 'ఆహా'లో ప్రసారం అవుతున్న డాన్స్ షో 'డాన్స్ ఐకన్' కు జడ్జీగా వ్యవహరిస్తోంది. షోలో తనదైన శైలిలో రెస్పాండ్ అవుతూ ఆకట్టుకుటోంది. ప్రస్తుతం తమిళంలో 'జైలర్' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.