అందాల ముద్దుగుమ్మ
శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ
పెళ్లి సందD
మూవీ తో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన మొదటి
మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తన నటన తో , డాన్స్ తో , అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ ధమాకా అనే
మూవీ లో
మాస్ మహారాజా
రవితేజ సరసన
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ కి త్రినాథ్ దర్శకత్వం వహించాడు.
కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ధమాకా
మూవీ నుండి ఇప్పటికే
మూవీ యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ
మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను కూడా విడుదల చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా
మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ
రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో అవకాశాన్ని దక్కించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
సినిమా షూటింగ్ కూడా కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస
మూవీ అవకాశాలను దక్కించుకున్న
శ్రీ లీల మరో రెండు క్రేజీ
మూవీ ల అవకాశాలు దక్కిన దక్కినట్లు తెలుస్తుంది. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా
శ్రీ లీల ఇలా వరుస
మూవీ ఆఫర్ లతో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది.