తెలుగులో ఇప్పుడు వరుస సినిమాలు తెరకెక్కుతున్నాయి.. అన్నీ స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం.. ఇక
న్యాచురల్ స్టార్ నాని సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు... బ్యాక్ టు బ్యాక్ సినిమాల తో బిజిగా ఉన్నాడు.
నాని ప్రధాన పాత్ర లో నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం 'దసరా'. భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని
సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ
సినిమా పై అంచనాలు కూడా భారీగానే పెట్టుకున్నారు. గతంలో వచ్చిన
నాని సినిమాలు అనుకున్నంత హిట్ ను అందుకోలేక పోయాయి..
కాగా, ఈ
సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ
సినిమా టీజర్ అండ్ సాంగ్స్ కు మంచి హైప్ రావడం తో ఓటీటీ డీల్ కూడా భారీ రేటు కు కుదిరిందని తెలుస్తోంది. ప్రముఖ OTT కంపెనీ
అమెజాన్ ఈ
సినిమా తెలుగు మరియు ఇతర భాషల కు చెందిన రైట్స్ మొత్తం 40 కోట్ల కు సొంతం చేసుకుందట. శాటిలైట్ రైట్స్ కూడా రూ.20 కోట్లు పలికాయి అని సమాచారం. వీటి తో దాదాపు రూ.60 కోట్ల వ్యాపారం జరిగింది..
ఇక ఈ
సినిమా థియేట్రికల్ రైట్స్ మొత్తం రూ.40 కోట్ల కు అమ్ముడు పోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ
సినిమా రిలీజ్ కు ముందే రూ.100 కోట్ల బిజినెస్ చేసిందన్నమాట.
నాని లాంటి మిడిల్ రేంజ్ హీరో, కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న
సినిమా అయినా కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగడం తో అందరూ ఆశ్చర్య పోతున్నారు. మరి చూడాలి ఈ
సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ
సినిమా హిట్ అయితేనే అతడి కీ మళ్ళీ కెరియర్ ఊపందుకుంటుంది.. మరి ఎమౌతుందో చూడాలి..