దర్శకుడు మరియు నటుడు అయినటువంటి ఎస్ జే
సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఎస్ జె సూర్య నటుడి గా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించాడో , దర్శకుడిగా కూడా ఎన్నో బ్లాక్ బాస్టర్
మూవీ లకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను అదే రేంజ్ లో అలరించాడు. ఎస్ జే
సూర్య దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న సినిమాలలో
ఖుషి మూవీ ఒకటి.
ఖుషి
మూవీ ఇప్పటికీ కూడా
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కెరియర్ లో అద్భుతమైన విజయాలలో ఒకటిగా కొనసాగుతుంది ఇది ఇలా ఉంటే అప్పట్లో
ఖుషి సినిమా అదిరిపోయే
బ్లాక్ బస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా కలెక్షన్ ల వర్షాన్ని కూడా బాక్సా ఫీస్ దగ్గర కురిపించింది.
ఖుషి మూవీ లో పవన్
కళ్యాణ్ సరసన
భూమిక హీరోయిన్ గా నటించగా , మణిశర్మ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
ఎస్ జె సూర్య "ఖుషి"
మూవీ పార్ట్ 2 గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.
ఎస్ జె
సూర్య "ఖుషి పార్ట్ 2"
మూవీ గురించి మాట్లాడుతూ ... నా దగ్గర
ఖుషి పార్ట్ 2
మూవీ స్టోరీ రెడీ గా ఉంది. పవన్
కళ్యాణ్ గారు ఓకే అంటే స్టార్ట్ చేస్తా అంటూ చెప్పు కోచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
ఎస్ జె సూర్య వరుస మూ వీలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఎస్ జే
సూర్య i మధ్య మానాడు , డాన్
మూవీ లలో కీలక పాత్రలో నటించాడు. ప్రస్తుతం
ఎస్ జె సూర్య , మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ సి 15
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.