టాలీవుడ్
యువ హీరోలలో ఒకరు అయిన
పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ
యువ హీరో ఉప్పెన
మూవీ తో
హీరో గా
వెండి తెరకు పరిచయం అయ్యాడు.
హీరో గా ఎంట్రీ ఇచ్చిన మొదటి
మూవీ తోనే 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను సాధించాడు. అలాగే ఈ
మూవీ తో అద్భుతమైన క్రేజీ ను కూడా తెలుగు
సినిమా ఇండస్ట్రీలో
పంజా వైష్ణవ్ తేజ్ సంపాదించు కున్నాడు.
ఇది ఇలా ఉంటే
పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా అనే
మూవీ లో
హీరో గా నటించాడు. ఈ
మూవీ లో
పంజా వైష్ణవ్ తేజ్ సరసన
రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ
హీరోయిన్ గా నటించగా , గిరిసయ్య ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ కి రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ
మూవీ విడుదలకు ముందు ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించడంతో టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రంగ రంగ వైభవంగా
సినిమా 3.81 కోట్ల షేర్ , 7.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను మాత్రమే వసూలు చేసింది. దానితో ఈ
మూవీ 5.19 కోట్ల నష్టాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని డబల్ డిజాస్టర్
మూవీ గా నిలిచింది.