'లైగర్' మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్  బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించగా ,  డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక ముఖ్య పాత్రలో నటించగా ,  రమ్య కృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించింది.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ ,  హిందీ , కన్నడ ,  మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దానితో ఈ మూవీ కి బాక్సా ఫీస్ దగ్గర చిత్ర బృందం ఆశించిన మేరా కలెక్షన్ లు కూడా రాలేదు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్న నేపథ్యం లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 88.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల బ్రేక్ ఈవెన్ ఫార్ములా తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 28.20 కోట్ల షేర్ , 60.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను మాత్రమే వసూలు చేసింది. దానితో ఈ మూవీ 61.80 కోట్ల భారీ నష్టాలను అందుకొని భారీ ఫ్లాప్ గా మిగిలి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: