ఎన్నో వైవిధ్యమైన
మూవీ లకు దర్శకత్వం వహించి దేశంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న గ్రేట్
డైరెక్టర్ మణి రత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో భారీ
బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించిన మణి రత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే
మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో మొదటి భాగం రేపు అనగా
సెప్టెంబర్ 30 వ తేదీన
తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ
మూవీ లో చియాన్
విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష వంటి భారీ క్రేజ్ ఉన్న నటీనటులు నటించారు. ఈ
మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఇలా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న మణి రత్నం ఈ
మూవీ కి దర్శకత్వం వహించడం , హేమా హేమీ నటీనటులు అయిన చియాన్
విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష వంటి నటీనటులు ఈ
మూవీ లో నటించడం వల్ల ఈ
మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ
మూవీ లో ప్రముఖ పాత్రలలో నటిస్తున్న నటీనటులు ఈ
మూవీ లో ఏ పాత్రలో పోషించారు చూద్దాం.
చియాన్
విక్రమ్ ఈ
మూవీ లో
ఆదిత్య కరికాలన్ పాత్రను పోషించాడు.
ఐశ్వర్య రాయ్ ఈ
మూవీ లో నందిని పాత్రను పోషించింది. కార్తీ ఈ
మూవీ లో వల్లభ రాయన్ వందిదేవన్ పాత్రను పోషించాడు.
త్రిష ఈ
మూవీ లో కుండవై పాత్రను పోషించింది.
జయం రవి ఈ
మూవీ లో అరుళ్ మొళి వర్మన్ పాత్రను పోషించాడు.