తెలుగు
చిత్ర పరిశ్రమ లో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తెలియని వాళ్ళు ఉండరమో..మొదటి
సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు.. ఇటీవల విడుదల అయిన సర్కారు వారి పాట
సినిమా ఎంత
సక్సెస్ అయిందో అందరికి తెలుసు.ఇప్పుడు మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ డైరెక్షన్లో
సినిమా చేస్తున్నారు. ఆ
సినిమా ఇటీవల సెట్స్ మీదకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ
సినిమా రెగ్యులర్ షూటంగ్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ
సినిమా తొలి షెడ్యూల్‌ను కేవలం మూడు రోజుల్లోనే ముగించేయడంతో అభిమానులతో పాటు చిత్ర వర్గాలు కూడా అవాక్కయ్యాయి.
ఇంత త్వరగా ఈ
సినిమా తొలి షెడ్యూల్‌ను ముగించడంతో ఈ
సినిమా షూటింగ్ కూడా అంతే త్వరగా పూర్తవుతుందని అందరూ భావిస్తున్నారు.అయితే ఈ
సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ యాక్షన్ సీక్వెన్స్ ఔట్‌పుట్ విషయంలో దర్శకుడు
త్రివిక్రమ్,
హీరో మహేష్ బాబు ఇద్దరూ కూడా శాటిస్ఫై కాలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించాలని.. అందుకే ఈ సీక్వెన్స్‌ను మళ్లీ చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట..
అందుకే తొలి షెడ్యూల్‌ను ముందుగా అనుకున్నట్లుగా కాకుండా, కేవలం మూడు రోజుల్లోనే ముగించారట మహేష్ అండ్ టీమ్.మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాతో పాటు
ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల
భామ పూజా హెగ్డే నటిస్తోండగా,
థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు..పూజా హెగ్డే కు గత రెండేళ్ళ నుంచి ఒక్క హిట్
సినిమా కూడా పడలేదన్న విషయం తెలిసిందే..ఈ
సినిమా తో మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఈ
సినిమా హిట్ అయితేనే అమ్మడుకు మళ్ళీ వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తుంది.