ఒకే ఒక జీవితం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా...!!

murali krishna
ఇక ఈ సినిమాలో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. ఇక మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే బాక్సాఫీస్ వద్ద ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమైందట.


ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లీవ్ కైవసం చేసుకుందని సమాచారం.. ఇక ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఈ సినిమా థియేటర్ లో విడుదలైన 9 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనించింది. శతమానం భవతి సినిమా తర్వాత శర్వానంద్ కు సరైన హిట్ ఏ సినిమా రాలేదని చెప్పాలి అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమా శర్వానందుకు ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చిందట  


ఇక థియేటర్లో ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ మీడియాలో ప్రసారం కానుంది. థియేట్రికల్ రన్ పూర్తి అయిన 6 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ రెండవ వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.


ఇక త్వరలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను సుమారు 15 కోట్లకు సోనీ లీవ్ కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది.థియేటర్లో అందరిని మెప్పించిన శర్వానంద్ డిజిటల్ మీడియాలో ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్, రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందు కు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నది 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: