అవకాశాలు లేక కాల్ సెంటర్ లో పనిచేస్తున్నాను అంటున్న.... నటి...!!

murali krishna
సినీ పరిశ్రమ అనేది బయట చూసేవారి కి రంగుల ప్రపంచమే… కానీ ఇక్కడ కూడా ఎవరి కష్టాలు వారి కి ఉంటాయి. సక్సెస్ లు ఉంటే నే అవకా శాలు వస్తాయి..
అవకాశా లు వస్తే నే నాలుగు డబ్బులు ఉంటాయి, గుర్తింపు ఉంటుంది. లేదు అంటే సడన్ గా మొత్తం మైనస్ అయిపోతుంది. జీరో నుండి వచ్చిన వాళ్ళు తిరిగి జీరో కి వెళ్లినా ఏదో ఒక రోజు మళ్ళీ ఎదుగు తారు. కానీ మొదటి నుండి టాప్ లో ఉండి పడ్డ వాళ్ళు మాత్రం కోలు కున్న వాళ్ళు తక్కువ.
సరే ఇక అసలు విషయాని కి వస్తే.. ఓ నటి అవకా శాలు లేక కాల్ సెంటర్ లో పనిచేస్తుం దట. అయితే ఈమె తన తప్పిదాల వల్ల కింద పడిన వ్యక్తి కాదు. కరోనా కారణంగా నే అవకాశాలు దక్కించు కోలేకపోయింది. ఆమె మరెవరో కాదు సీరియల్ నటి ఏక్తా శర్మ. ఆమె మాట్లాడుతూ.. '2 ఏళ్లుగా నాకు అవకాశాలు లేవు.దీంతో ఇల్లు గడవడం కష్టమైంది. అందుకోసం నగలు కూడా అమ్మే శాను. ప్రస్తుతం నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను.
అవకాశాలు రావడం లేదని ఏడుస్తూ కూర్చుం టే బతుకు నడవదు కదా.. అందు కే చదువు కి తగ్గ జాబ్ వెతుక్కున్నాను, ఇప్పుడు కాల్ సెంటర్ లో పని చేస్తున్నాను. కాల్ సెంటర్ లో పని చేయడం తప్పనిపించడం లేదు.ఎవరో వస్తారు, మన కేదో చేస్తారు, ఏదో అద్భుతం జరుగుతుంది అంటూ ఎదురుచూడడం టైం వేస్ట్..! ఇప్పటికైతే కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఆడిషన్స్ ఇస్తున్నాను.ఎప్పటికైనా మళ్ళీ అవకాశాలు వస్తాయన్న నమ్మకం నాకు ఉంది' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.'డాడీ సంఝా కరో', 'కుసుమ్', 'క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ', 'కామినీ-దామిని' 'బెప్నా ప్యార్' వంటి టీవీ షోలలో కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: