చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ 'ఓటిటి' హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా ,  లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించ బోతుంది. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లో తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న సత్య దేవ్ ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్రలో కనిపించ బోతున్నాడు. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. గాడ్ ఫాదర్ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ అయినటు వంటి లూసిఫర్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ 'ఓ టి టి' హక్కులకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  గాడ్ ఫాదర్ మూవీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అయినటు వంటి నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ 57 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ పై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: