టాలీవుడ్ మీడియా మీద తీవ్రంగా మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్....!!
అయితే ఇప్పుడు ప్రభాస్ 10 ఏళ్ల తర్వాత సొంత ఊరు మొగల్తూరు కి వెళ్ళబోతున్నట్లు సమాచారం. కృష్ణంరాజు సంస్మరణ సభను ఆయన కుటుంబ సభ్యులు మొగల్తూరులో ఈనెల 28వ తేదీన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ ప్రస్తుతానికి వరుస సినిమాలు చేస్తున్నా ఆయన పెదనాన్న మృతి చెందడంతో ఆ సినిమా షూటింగ్స్ అన్నింటికీ దూరంగా ఉంటున్నాడు.
తన కుటుంబం బాధలో ఉన్న సమయంలో వారిని వదిలి షూటింగ్స్ కి వెళ్ళటం కరెక్ట్ కాదని భావించిన తన వారిని చూసుకుంటూ అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క ప్రభాస్ ఇంత బాధలో ఉంటే ప్రభాస్ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు రావడంతో ప్రభాస్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏ సమయంలో ఎలాంటి వార్తలు రాయాలో కూడా తెలియదా అంటూ మీడియా మీద వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ 'ఆది పురుష్'అనే సినిమాలో రాముడి పాత్రలో నటిస్తుండగా అదే సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. ఇక వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది అని ప్రచారం జరుగుతోంది. అయితే దీనంతటికీ కారణం కాఫీ విత్ కరణ్ షోలో కృతి సనన్ ప్రభాస్ కు కాల్ చేయడమే అని తెలుస్తోంది. ఎవరైనా మంచి స్నేహితుడికి కాల్ చేయమని కరణ్ జోహార్ కోరడంతో కృతిసనన్ ప్రభాస్ కు కాల్ చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే ప్రభాస్ కాల్ లిఫ్ట్ చేయడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందని కథనాలు పుట్టుకొస్తున్నాయి.దీని మీద ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు..