ఇది వరకే
జూనియర్ ఎన్టీఆర్ ,
కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్
మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ
మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే రెండవ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ
మూవీ ని పాన్
ఇండియా స్థాయికి మించి తెరకెక్కించాలని దర్శకుడు
కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ
సినిమా షూటింగ్ కూడా కాస్త డిలే అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కోసం
జూనియర్ ఎన్టీఆర్ కూడా కాస్త బరువు తగ్గి అదిరిపోయే స్లిమ్ లుక్ లోకి రాబోతున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
మూవీ లో
ఎన్టీఆర్ సరసన పలానా
హీరోయిన్ కనిపించబోతుంది అంటూ అనేక ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చిన విషయం మనకు తెలిసింది. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మొదటగా ఈ
మూవీ లో
ఎన్టీఆర్ సరసన
మూవీ యూనిట్ గా
హీరోయిన్ గా కీయారా అద్వానీ ని అనుకున్నట్లు , కాకపోతే ఈ ముద్దుగుమ్మ ఇతర
మూవీ లతో బిజీగా ఉండడం వల్ల ఈ
మూవీ లో నటించలేకపోయినట్లు తెలుస్తోంది. తర్వాత రెండవ ఆప్షన్ గా
రష్మిక మందన ను తీసుకోవాలని
మూవీ యూనిట్ ఆలోచనలు ఉన్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంతవ రకు నిజమో చూడాలి.